Hanumantha Rao | రాహుల్ బాటలోనే రేవంత్: హనుమంత రావు

-

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంత రావు(Hanumantha Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశం కోసం కాంగ్రెస్ ఏం చేసిందో అందరికీ తెలుసని, కిషన్‌కి మాత్రం తెలియదంటూ ఎద్దేవా చేశారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, కానీ 2014 నుంచి అధికారంలో ఉన్న మోదీ.. ఈ దేశం కోసం ఏం చేశారో కిషన్ రెడ్డి తప్పక చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తూనే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రజలను మభ్యపెట్టిన మోదీ.. ఒక్క హామీని కూడా సరిగా నెరవేర్చలేదన్నారు.

- Advertisement -

ఏడాదిలో రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పిన మోదీ(PM Modi).. ఎన్ని ఉద్యోగాలిచ్చారని కిషన్ రెడ్డి(Kishan Reddy)ని ప్రశ్నించారు హనుమంతరావు. ‘‘ఇందిరా గాంధీ భూ సంస్కరణలు చేసి, బ్యాంక్ లను జాతీయం చేశారు. మహాత్మా గాంధీ రోజ్ యోజన అమలు చేశారు. కాంగ్రెస్ IIT, IIM లో రిజర్వేషన్లు అమలు చేసింది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఏ కులం అని అంటున్నారు. రాహుల్ గాంధీది బడుగు బలహీన వర్గాల కులం’’ అని అన్నారు. మీ రాష్ట్రాలలో కులగణన చేస్తారా? లేదా? బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎవరు ఏమన్నా కౌంటర్లు ఇవ్వడం తెలిసిన బీజేపీకి పేదల సమస్యలు పరిష్కరించడం తెలియదా అని ప్రశ్నించారు. ప్రజల కష్టాల విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని, పొలికల్ మైలేజీ పెరుగుతుందని నమ్మితేనే ఏదైనా ఒక సమస్యను బీజేపీ(BJP) పరిష్కరిస్తుందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే శక్తి కేవలం కాంగ్రెస్, గాంధీ కుటుంబానికే ఉందని చెప్పారు.

రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాహుల్ గాంధీ ఆలోచనలను ఆచరిస్తున్నారని తెలిపారు. ‘‘అన్ని రాష్ట్రాలలో కులగణన చేయాలని బీజేపీ నాయకులకు విజ్ఞప్తి. ముస్లింలతో బీజేపీకి ఎందుకు అంత భయం. ఓన్లీ హిందు ఓట్లు కావాలి అంటున్నారు. ముస్లింలు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? లేదా? ఇప్పటికైన కిషన్ రెడ్డి ఇలాంటి స్టేట్మెంట్లను బంద్ చేయాలి’’ అని V Hanumantha Rao కోరారు.

Read Also: ‘రైతులను అప్పులపాలు చేస్తోంది కాంగ్రెస్ కాదా?’
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

IAS Officers | తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణ ప్రభుత్వం మరోసారి పలువురు ఐఏఎస్‌లను(IAS Officers) బదిలీ చేసింది. మొత్తం...

Delhi Ministers | ఢిల్లీ కొత్త మంత్రుల పూర్తి వివరాలివే!

Delhi Ministers | దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల పోరు హోరాహోరీగా...