సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈరోజు నారాయణపేట(Narayanpet) జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ. 130 కోట్ల నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ. 26కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. రూ.56 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీ అకాడమిక్ బ్లాక్‌లను ఆయన ప్రారంభించారు. రూ.5.58 కోట్లతో నిర్మించిన ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు.
రూ.1.23 కోట్లతో జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించే పెట్రోల్ బంక్‌ను, రూ. 7కోట్లతో మరికల్ మండల పరిషత్ ఆఫీసు కాంప్లెక్స్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్బంగానే మారుమూల ప్రాంతాలకు కూడా వైద్యసేవలను అందిస్తామని, మెడికల్ కాలేజీకి నిధుల లోటు రానివ్వమని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను పుష్కలంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. వైద్య వృత్తి అనేది ఉద్యోగం కాదని, అదో బాధ్యత అని, వైద్యసేవ అనేది మానవత్వంతో నిర్వర్తించాల్సిన బాధ్యత అని Revanth Reddy వ్యాఖ్యానించారు.