DK Aruna | ‘నిధులు త్వరగా మంజూరు చేయండి’.. సీఎంకు డీకే అరుణ ప్రతిపాదన

-

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. నారాయణపేట జిల్లా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ డీకే అరుణ(DK Aruna) కూడా సీఎంతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పక్‌పల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌ను సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం మహిళా సమాఖ్య సభ్యులతో నిర్వహించిన సమావేశంలో డీకే అరుణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సీఎంతో చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్ట్‌లు చాలా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

ఈ సందర్భంగానే దాదాపు 20 ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని ఆమె సీఎంకు అందించారు. ఉమ్మడి జిల్లా అభివృద్దికి సంబంధించి రిప్రసెంటేషన్ ఇచ్చారు ఎంపీ డికె అరుణ. సాధ్యమైనంత త్వరగా నిధులు మంజూరు చేసి పనులు పూర్తయ్యేలా చూడాలని సిఎంను కోరారు.

DK Aruna చేసిన ప్రతిపాదనలు ఇవే..

1. G.O.69 కి సంబంధించిన భూనిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.

2. నారాయణపేట పట్టణానికి మంజూరైన మెడికల్ కళాశాలకు సంబంధించిన సిబ్బందిని ఇంతవరకు పది శాతం కూడా నియమించబడలేదు కావున వెంటనే పూర్తిస్థాయిలో నియమించాలి.

3. నారాయణపేట పట్టణానికి మహిళా డిగ్రీ కళాశాల, పిజి కళాశాల, ఐటిఐ కళాశాల మరియు పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు చేయగలరు

4. మఖ్తల్ నియోజకవర్గ కేంద్రానికి పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయగలరు.

5. మరికల్ మండల కేంద్రానికి (నారాయణపేట జిల్లా) జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలు మంజూరు చేయగలరు.
6. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మంజూరు కాబడినటువంటి నవోదయ పాఠశాలను గండీడు మండల కేంద్రంలో నిర్మించుటకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది.

7. గండీడు మండలం పరిగి అసెంబ్లీ నియోజకవర్గం మరియు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది, కావున నూతనంగా మంజూరు కాబడిన నవోదయ పాఠశాలను మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోనే నిర్మించాలి.

7. జిల్లాలో మంజూరు కాబడిన గురుకుల పాఠశాలలకు సొంత భవనములు ఇంతవరకు లేనందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. కావున వెంటనే సొంత భవనాలు మంజూరు చేసి పూర్తిస్థాయిలో సత్వరమే నిర్మాణం చేపట్టగలరు.

8. కోటకొండ గ్రామం (నారాయణపేట జిల్లా) ను నూతన మండలంగా ఏర్పాటు చేయగలరు.

9. గార్లపహాడ్ గ్రామం (మహబాబ్ నగర్ జిల్లా) ను నూతన మండలంగా ఏర్పాటు చేయగలరు.

10. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని భూనీడు గ్రామంలో నూతన పోలీస్ స్టేషన్ మంజూరు చేయగలరు.

11. నారాయణపేట పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైనందున దీనివల్ల దోమలతోమలేరియా డెంగ్యూ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు కావున వెంటనే చర్యలు చేపట్టాలి.

12. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని తీవ్ర నీటి కొరత ఏర్పడుతున్నందున యుద్ధ ప్రాతిపదికన పాతబడిన బోర్లను రిపేర్ చేయడం కానీ లేదా కొత్త బోర్లను మంజూరు చేయగలరు.

13. చేనేత కార్మికులకు THRIFT FUND కింద ప్రతి జియో ట్యాగ్ కి సబ్సిడీ రూపాయలు 2000/- గతంలో ఇచ్చేవారు. ప్రస్తుతం 1600/- రూపాయలకు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. దీనిని వీలైతే పెంచడం లేదంటే పాత పద్ధతినే కొనసాగించడం చేయాలి మరియు చేనేత కార్మికులకు హెల్త్ కార్డులు ఇచ్చే ఏర్పాటు చేయాలి.

14. నారాయణపేట జిల్లాకు చేనేత పార్కు మరియు ఇండస్ట్రియల్ పార్కు గత ప్రభుత్వం హయాంలో మంజూరు చేసినప్పటికీ ఇంతవరకు అతిగతి లేదు, కావున ప్రస్తుత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి

15. నారాయణపేట జిల్లా కేంద్రానికి గతంలో మంజూరు కాబడినటువంటి ప్రభుత్వ అతిథి గృహాన్ని కొడంగల్ నియోజకవర్గానికి తరలించడం జరిగింది. కావున తక్షణమే నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ అతిథి గృహం వెంటనే మంజూరు చేయగలరు.

16. నూతన జిల్లా ఏర్పడి 6 సంవత్సరములు పూర్తయినా గాని ఇంతవరకు కలెక్టరేట్ భవనం పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదు మరియు ఎస్పీ భవనం నిర్మాణం మొదలే కాలేదు కావున ఇట్టి విషయమై సత్వర చర్య తీసుకోగలరు.

17. కొల్లూరు గేట్ నుండి కొల్లూరు గ్రామం వరకు (ఉట్కూర్ మండలం) బిటి రోడ్డు మంజూరు చేయగలరు.

18. సమస్తాపూర్ గేట్ (ఉట్కూర్ మండలం) నుంచి కర్ణాటక బోర్డర్ (ఇడ్లూర్ -కర్ణాటక) వరకు బిటి రోడ్డుమంజూరు చేయగలరు.

19. పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు ఉద్యోగులు తమ పదవీ విరమణ ఆర్థిక ప్రయోజనలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సంబంధిత ట్రెజరీ నుండి టోకెన్ నెంబర్ జారీ చేయబడినప్పటికీ ఈ-కుబేర్ లో వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ చూయిస్తున్నందున వెంటనే చర్య తీసుకొని చెల్లించవలసిందిగా విజ్ఞప్తి.

20. ప్రసాద్ స్కీం లో చేర్చడానికి ఈ క్రింద తెలిపిన దేవాలయాలు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగలరు.

Read Also: కాలేజీకి ఆయన పేరే కరెక్ట్: సీఎం రేవంత్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Jagan | అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ రెడీనా!

అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు....

SLBC Tunnel | ఎస్‌ఎల్‌బీసీ ఘటన.. ఎనిమిది మంది గల్లంతు

శ్రీశైలం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది....