Harish Rao – Revanth Reddy | బీఆర్ఎస్ పదేళ్ల పాలన, బీజేపీ 14 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 14 నెలల పాలనపై దమ్ముంటే చర్చకు రావాలంటే కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. కాగా ఆయన సవాల్‌ను బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు స్వీకరించారు. చర్చ ఎక్కడ పెట్టేది రేవంత్ ఇష్టమని, ఆయన ఎక్కడి రమ్మంటే అక్కడకు ఎప్పుడంటే అప్పుడు రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని హరీష్ రావు తెలిపారు. ఆరు గ్యారెంటీలు, 420క హామీలు సహా అన్ని అంశాలపై చర్చిద్దామని అన్నారు.
చర్చించడం నిందులు వేసినంత సులభం కాదని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా నారాయణపేటలో మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్ట్‌పై(Palamuru Rangareddy Project) నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారని రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు.
‘‘ఏ రోజు చర్చ చేద్దాము, ఎక్కడ చర్చ చేద్దాము నువ్వే చెప్పు. నువ్వు చెప్పిన చోటికి, చెప్పిన సమయానికి వస్తా. నీ కొడంగల్(Kodangal) నియోజకవర్గమైన సరే, చివరకు నీ ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తా నీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో పాటు, రుణమాఫీ సంగతి, రైతుబంధు సంగతి, మహాలక్ష్మి పథకం సంగతి, పెంచవలసిన పెన్షన్ల సంగతి, నిరుద్యోగ భృతి సంగతి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏల సంగతి, పెన్షనర్లకు ఇవ్వని పెన్షన్ బెనిఫిట్ ల సంగతి సకలం చర్చిస్తా.. నీ పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసే చాకిరేవు పెడతా. రేవంత్ రెడ్డి కుసంస్కారి కనుకే కేసీఆర్(KCR) పై కక్ష పూరిత ఆరోపణలు.
దవడలు పగల గొట్టాల్సివస్తే అన్నింటా దగా చేసి ఏపీ కృష్ణా జలాల(Krishna Water) దోపిడీని నిలువరించలేకపోతున్నా. నీ దవడనే పగలగొట్టాలి. అరుపులు, పెడబొబ్బలతో రాష్ట్ర సాగు తాగు నీళ్ల కష్టాలు తీర్చలేవు రేవంత్ రెడ్డి’’ అని తెలిపారు. ‘నిందలు వేయడం మాని నదీజలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడు. కడుపులో విషం పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలతో పాలన చేస్తే ఫలితాలు రావు అబద్దాల కోసం అజ్ఞానిలా నీ బుర్రను వాడే బదులు పది మందికి ఉపయోగపడేలా పాలన అందించడానికి ప్రయత్నించు రేవంత్ రెడ్డి’ అని Harish Rao అన్నారు.