ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు గల్లంతయ్యారు. వారిని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది. టాస్క్ ఫోర్స్‌ను కూడా రంగంలోకి దించింది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అడిగి తెలుసుకుంటారు. ఈ విషయం ఢిల్లీకి చేరడంతో ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి ఆరా తీశారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ర రెడ్డికి ఫోన్ చేసి ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై మాట్లాడారు.
రక్షణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రధానితో(PM Modi) మాట్లాడిన సీఎం.. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్(Uttam Kumar Reddy) రెడ్డి, జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఆర్మీ నుంచి సహాయం కోరినట్లు చెప్పారు. వివరాలు తెలుసుకున్న ప్రధాని మోదీ.. సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను వెంటనే పంపుతామని చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.