శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి ఉందని అధికారిక వర్గాలు చెప్తున్న క్రమంలో లోపల చిక్కుకున్నవారి విషయంలో ఆశనలను క్షీణింపజేస్తున్నాయి. అయినా వారిని రక్షించడం కోసం ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. టాస్క్‌పోర్స్‌ను సైతం రంగంలోకి దించింది. ఇరుక్కుపోయిన వారిని రక్షించడం కోసం వందల మంది రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్(Rat Hole Miners) కూడా దిగారు.
SLBC | వీరిని ఢిల్లీ నుంచి రప్పించారు. హైదరాబాద్‌కు చేరుకుంటూనే వారు ఘటనా స్థలానికి బయలదేరారు. కాగా అక్కడ చిక్కుకున్నవారిని రక్షించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా? పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ఏం చేయగలం? ఎలా చేయాలి? అన్న అంశాలపై దృష్టి పెడతామని ర్యాట్ హోల్ మైనర్లు తెలిపారు. రెస్క్యూ టీమ్స్‌తో కలిసి సమన్వయం చేసుకోవాలని చెప్పారు. బురద, నీరు ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారని, అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు ఎలా కొనసాగాలని అనే నిర్ణయం తీసుకోగలమని చెప్పారు.