Nara Lokesh in AP Council | ఏపీ శాసన మండలిలో కూటమి ప్రభుత్వ సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య రగడ జరిగింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంలో మండలిలో కూటమి సభ్యులు , వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ ప్రసంగంలో ఇంగ్లీష్, తెలుగు ప్రతులలో తేడా ఉందంటూ మండలిలో గందరగోళం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కళ్యాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తూ సుపరిపాలన అని చెప్పడం విడ్డురంగా ఉందని అన్నారు. ఇప్పటికి తల్లికి వందనం, రైతు భరోసా అమలుచేయలేదని ఆమె అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, పిఆర్సీ, ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన అని కళ్యాణి(Varudu Kalyani) ప్రశ్నించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో నియమించిన పిఆర్సీ కమిషన్ ఛైర్మెన్ ని బెదిరించి రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. అలాగే గవర్నర్ ప్రసంగంలో(Governor Speech) 4లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయి అని ఉందని ఆమె అన్నారు. గవర్నర్ తో అన్ని అబద్దాలే చెప్పించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల లోపే 1.25 లక్షల ఉద్యోగాలను కల్పించినట్లు ఆమె తెలిపారు.
మంత్రి లోకేష్(Nara Lokesh) ఈ విషయంపై సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్లు ఎక్కడ చెప్పలేదని.. ఉద్యోగ అవకాశాలు కల్పించామని, నియమించినట్లు చెప్పలేదని లోకేష్ స్పష్టం చేసారు. పరిశ్రమలు వచ్చిన రెండు, మూడేళ్ళ తర్వాత ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. పిఆర్సీ కమిషన్ ఛైర్మెన్ ను బెదిరించారని కళ్యాణి చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు.
Read Also: దేశ గౌరవాన్ని విస్మరించేలా సీఎం మాటలు