Glowing Skin | ముత్యంలాంటి చర్మ సౌందర్యం కావాలి.. ఇవి ట్రై చేయండి..

-

Glowing Skin | అందంగా కనిపించాలని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనం వెళ్తుంటే అందరూ మనల్ని చూసి నోరెళ్లబెట్టాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ వాతావరణం, ఆహారం, జీవనశైలి వల్ల చర్మ సౌందర్యం విషయంలో ఎప్పుడూ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఈ సమస్య ఒకరిద్దరికి కాదు దాదాపు 90శాతం మంది ఎదుర్కుంటున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినా లాభం ఉండటం లేదని, మొఖంపై మచ్చలు రావడం, చర్యం ముదిరిపోయినట్లు అవడం, మొటిమలు, చిన్నచిన్న గుల్లలు వంటి రావడం జరుగుతుందని సౌందర్య ప్రియులు బాధపడిపోతుంటారని నిపుణులు అంటున్నారు.

- Advertisement -

చాలా మందికి వారు వినియోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ వల్లే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని చెప్తున్నారు. మరికొందరైతే మచ్చలేని చర్మం కోసం హోమ్ రెమెడీస్ మొదలు కనిపించిన ప్రతి మార్గాన్ని వాడేస్తారు. అయితే ఫలితం పెద్దగా కనిపించదు. చాలా వరకు మన ఆహారం వల్లే ఇటువంటి సమస్యలు వస్తుంటాయి. చెడు ఆహారపు అలవాట్లు ఉన్నవారిలో ఈ సమస్యలు మరీ అధికంగా ఉంటాయి. మన ఆహారపు అలవాట్లకు తోడు.. వాతావరణం కూడా కలిస్తే.. ఇక ముఖమంతా దారుణంగా కనిపిస్తుంటుంది. అయితే ఈ సమస్యలకు హోమ్ రెమెడీస్ వినియోగించడం ద్వారా ముత్యంలాంటి మచ్చలేని చర్మాన్ని పొందవచ్చని చర్మ సౌందర్య నిపుణులు చెప్తున్నారు. అందులోనూ బియ్యం పిండిని వినియోగించడం ఇంకా మంచిదని అంటున్నారు. మరి ఆ బియ్యం పిండిని ఎలా వాడాలో చూద్దామా..

డార్క్ సర్కిల్స్: బియ్యం పిండిలో కాస్తంత పసుపు, టమాటా రసం కలపాలి. దాన్ని కంటి చుట్టూ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గంటసేపు లేదా అది ఆరిపోయే వరకు వదిలేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లని నీటితోనే కడుక్కోవడం శ్రేయస్కరం. ఈ మిశ్రమంలో వాడే బియ్యం పిండి, పసుపు, టమాటా రసం మూడింటిలో చర్మాన్ని మెరిసేలా(Glowing Skin) చేసే లక్షణాలున్నాయి. కాబట్టి ఇది డార్క్ సర్కిల్స్‌కు మంచి పరిష్కారంగా చెప్తారు నిపుణులు.

ముఖ సౌందర్యానికి: ఆముదం నూనె, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకుని బాగా కలుపుకోవాలి. అది పేస్టులా అవుతుంది. దాన్ని మొటిమలు, మచ్చలపై అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. 30 నిమిషాలు అలా వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఆముదంలో కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మరమ్మతు చేయడానికి, మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి.

హైపర్ పిగ్మెంటేషన్: ఈ సమస్యకు బియ్యం పిండి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి నిమ్మకాయ, బియ్యం పిండిని ఉపయోగించండి. ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసిన తర్వాత అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి ఆ ప్యాక్ ను ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు అలా వదిలేసి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా మీరు రెండు మూడు సార్లు చేశాక మీకు ఎంతో మార్పు కనిపిస్తుంది.

Read Also: బరువు త్వరగా తగ్గాలంటే వాకింగ్ చేయాలా? సైక్లింగ్ చేయాలా?
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gujarat | శివాలయంలోని శివలింగం చోరీ..

Gujarat |‘గుడిని.. గుల్లోని లింగాన్ని మింగేసే రకం’ అంటూ స్వార్థం కోసం...

East Godavari | మహాశివరాత్రి వేళ తాడిపూడిలో విషాదం..

గోదావరిలోకి దిగి ఐదుగురు మృతిచెందిన ఘటన తూర్పు గోదావరి(East Godavari) జిల్లా...