East Godavari | మహాశివరాత్రి వేళ తాడిపూడిలో విషాదం..

-

గోదావరిలోకి దిగి ఐదుగురు మృతిచెందిన ఘటన తూర్పు గోదావరి(East Godavari) జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటుచేసుకుంది. మహా శివరాత్రి(Maha Shivaratri) సందర్భంగా ఈరోజు(బుధవారం) ఉదయం స్నానం చేయడానికి 11 మంది యువకులు గోదావరిలోకి దిగారు. నదిలో లోతు ఎక్కువగా ఉన్న విషయాన్నీ యువకులు ఒకరిని కాపాడే ప్రయత్నం మరొకరు చేసి ఐదుగురు గల్లంతయ్యారు. మిగిలిన వారు ఒడ్డుకు చేరుకొని సాయంకోసం కేకలు వేయడంతో స్థానికులు గాలించగా ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది.

- Advertisement -

East Godavari | అక్కడికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు సాయంతో మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇసుక ర్యాంపులను గుర్తించకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. మృతులు టి.పవన్‌ (17), పి. దుర్గాప్రసాద్‌ (19), పి.సాయి కృష్ణ (19), ఎ. పవన్‌ (19), జి.ఆకాశ్‌ (19)గా గుర్తించారు. వీళ్లంతా ఇంటర్మీడియేట్ చుడుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన యువకులు కావడంతో తాడిపూడి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Read Also: వేములవాడలో భక్తులకు ఇక్కట్లు.. నిర్లక్ష్యమే కారణం..
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Posani Krishna Murali | పోసాని కృష్ణ మురళి అరెస్ట్.. ఏ కేసులో అంటే..

టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళిని(Posani Krishna Murali) ఏపీ రాయచోటికి...

DK Shivakumar | ‘కంఠంలో ప్రాణం ఉండగా బీజేపీలో చేరను’

కర్ణాటక(Karnataka ) రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? కాంగ్రెస్‌కు ఊహించని...