నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అరెస్ట్‌ను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ముమ్మాటికీ కక్షపూరిత చర్యేనన్నారు. అధికారం రావడంతో ఎన్‌డీఏ కావాలనే వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. పోసాని అరెస్ట్ అంశంపై ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా(Amzad Basha) స్పందించారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూని అవుతుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం జరుగుతున్నది. విమర్శలను కూటమి ప్రభుత్వం తట్టుకోలేక పోతుంది అందుకే పోసాని అరెస్టు చేశారు.
ప్రజల రక్షణకు కాక రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్నారు. పోసాని(Posani Krishna Murali) అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. ఎన్నికలలో వచ్చిన హామీలను అమలు చేయకుండా … వైఎస్ఆర్ కాంగ్రెస్(YSRCP) పార్టీ నాయకుల పైన కక్ష సాధింపు చర్యలు అమలు చేస్తున్నారు’’ అని ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజాద్ భాష ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఎన్‌డీఏ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.