టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళిని(Rajamouli) తాజాగా ఒక వీడియో చిక్కుల్లో పడేసేలా ఉంది. రాజమౌళి స్నేహితుడినని చెప్పుకుంటూ ఒక వ్యక్తి విడుదల చేసిన సూసైడ్ ముందు రికార్డ్ చేరసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రాజమౌళి ఇంత పని చేశాడా అని అభిమానులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. తనకు, రాజమౌళికి మధ్య ఒక అమ్మాయి వచ్చిందని, తమది కూడా ఆర్యా-2 తరహా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఆయన చెప్పారు. ఈ వీడియోను శ్రీనివాస్ అనే వ్యక్తి పోస్ట్ చేశారు.
అందులో ఏముందంటే.. ‘‘ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli), రమారాజమౌళి వల్ల ఈరోజు నేను చనిపోబోతున్నాను. ఇది నా మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడా? అని అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకోవాలనుకునేవాడెడూ చనిపోవాలనుకోడు. అందుకే నేను మరణ వాంగ్మూలం ఇస్తున్నా. నేను, రాజమౌళి 34 ఏళ్ల నుండి ఫ్రెండ్స్. మా మధ్యలోకి రమా వచ్చింది. వీళ్ల కోసం నేను నా లైఫ్ త్యాగం చేశాను. మధ్యలో మా మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి. ఇవన్నీ నేను బయట ఎక్కడ చెప్తానో అని నన్ను ఇద్దరు టార్చర్ చేస్తున్నారు’’ అని చెప్పారు శ్రీనివాస్.
శ్రీనివాస్(Srinivas) చేసిన ఆరోపణలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకానోకొ సమయంలో తమ స్టోరీని సినిమాగా తీస్తానన్నందుకే భయపడి తనను టార్చర్ చేస్తున్నారనికూడా శ్రీనివాస్ తన వీడియోలో చెప్పుకొచ్చారు. తాను చెప్పిన విషయాలపై సందేహం ఉంటే.. రాజమౌళి, రమను లై-డిటెక్టర్ టెస్ట్ చేయాలని చెప్పారు. రాజమౌళిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు.