ఎస్ఎల్బీసీ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగి ఐదు రోజులు ముగిసినా దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రివ్యూ చేయలేదని నిలదీశారు. ఎస్ఎల్‌బీసీ(SLBC) దగ్గర సహాయక చర్యలు అందించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ చేతకాని తనం బయటపడటంతో కేసీఆర్‌ను దూషించి ప్రజల దృష్టి డైవర్ట్ చేయడానికి సీఎం రేవంత్(Revanth Reddy) శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కవిత. ‘‘SLBC విషయంలో కేసిఆర్ పై విషం చిమ్ముతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి రూ.100 కోట్లు నిధుల కాంట్రాక్టు జానారెడ్డి ముందే ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసిఆర్. రూ.3300 కోట్లు అప్పటి టీడీపీ(TDP), కాంగ్రెస్(Congress) ప్రభుత్వాలు ఖర్చు పెడితే రూ.3900 కోట్లు మా బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎనిమిది మంది ప్రాణాలు పోతుంటే ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డి. పాత రిప్రజెన్టేషన్ ను కొత్తగా ఇచ్చారు తప్ప చేసింది లేదు తెచ్చింది లేదు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కూలిపోయాయి. ప్రధాని మోడీ రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ఎంత నిధులు తెచ్చారు?’’ అని ప్రశ్నించారు.
‘‘ఆరుగురు అనుమానాస్పదంగా చనిపోయారు అని మా కుటుంబం పై నెపం నెడుతున్నారు. ప్రధానిని కల్సిన తర్వాత రేవంత్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నాడు. అంటే ఇందులో పెద్ద యెత్తున కుట్ర కూడా ఉంది. టన్నెల్ లో ఇంత పెద్ద ప్రమాదం జరిగితే కనీసం రివ్యూ చేయలేదు. సహాయక చర్యల అంశం పై మాట్లాడటం లేదు. ఎనిమిది మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు వారి ఉన్నారో లేదో తెలియదు..ఢిల్లీ యాత్రలు, ఎన్నికల ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి’’ అని MLC Kavitha ఆగ్రహం వ్యక్తం చేశారు.