Vitamin D Deficiency | విటమిన్-డీ లోపాన్ని ఎలా గుర్తించాలో తెలుసా?

-

Vitamin D Deficiency | మనిషికి ప్రతి విటమిన్ చాలా ముఖ్యం. ఏ ఒక్క విటమిన్ లోపించినా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటిలో చాలా వరకు విటమిన్లు మనకు ఆహారం ద్వారా లభిస్తాయి. కొన్ని మాత్రం ప్రకృతి ద్వారా మాత్రమే వస్తాయి. ఆహారం ద్వారా అవి లభించినప్పటికీ.. అవి మనకు సరిపడా అందవు. అలాంటి వాటిలో ప్రథమంగా కనిపించేది విటమిన్-డి. ఇది సూర్యకాంతి నుంచి లభిస్తుంది. రోజూ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల సమయంలో ఎండలో నిల్చోవడం ద్వారా విటమిన్-డీని పొందవచ్చు. కానీ ఇప్పుడు బిజీ లైఫ్‌తో ఎండలో నిల్చునే సమయం కూడా ఎవరికీ ఉండటం లేదు. దీంతో చాలా మందికి విటమిన్ డీ లోపం ఏర్పడుతుందేని నిపుణులు చెప్తున్నారు. దీనిని గుర్తించడానికి పలు రకాల టెస్ట్‌లు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఖరీదుతో కూడుకున్నవి. అయితే విటమిన్ డీ లోపాన్ని మనం ఇంట్లోనే ఉండి కూడా గుర్తించవచ్చని నిపుణులు చెప్తున్నారు. మరి విటమిన్-డీ లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందామా..

- Advertisement -

జుట్టు రాలడం: శరీరంలో విటమిన్-డీ లోపిస్తే జుట్టు అధికంగా రాలుతుంది. చాలా మంది జుట్టు రాలుతుంటే జన్యుపరైన సమస్య అనుకుంటారు. పైగా జుట్టు రాలుతున్న సమస్యను లైట్‌ తీసుకుంటారు. కానీ విటమిన్-డీ లోపం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. ఈ విటమిన్ లోపం తలపై ఫోలికల్స్ ఏర్పడటానికి దారితీస్తుందని, దాని ఫలితంగా జుట్టు సమస్యలు కూడా అనేకం వస్తాయని నిపుణులు చెప్తున్నారు.

ఆందోళన: ఈ విటమిన్ లోపం వల్ల మనలో ఆందోళన, ఒత్తిడి కూడా అధికం అవుతాయి. ఏసీలో కూర్చుని ఉన్నా చెమటలు పట్టేస్తాయి. ఈ విటమిన్ సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి, మెదడుకు సరైన పనితీరుకు చాలా అవసరం. ఈ హార్మోన్ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. తగినంత విటమిన్ డి తీసుకోకపోవడం వల్ల మానసిక స్థితిలో మార్పులు, ఆందోళన మరియు నిరాశ కలుగుతాయి.

కండరాల నొప్పి: విటమిన్-డీ లోపం వల్ల కండరాల నొప్పులు కూడా వస్తాయి. కొద్దిసేపు నడిచినా అలసిపోతున్న భావన కలుగుతుంది. అమితమైన ఆయాసం వస్తుంది. కొన్ని సార్లు అధిక శ్రమ వల్ల కూడా ఇలానే అనిపిస్తుంది. కానీ విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసటగానే ఉంటుందంటే మాత్రం విటమిన్-డీ లోపంగానే భావించాలని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా విటమిన్-డీ లోపిస్తే కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయని చెప్తున్నారు.

ఈ సమస్య(Vitamin D Deficiency) నుంచి బయట పడాలంటే రోజూ ఒక అరగంట పాటు ఎండలో ఉండాలి. అదే విధంగా మన ఆహారంలో విటమిన్-డీ ఉన్న ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.

Read Also:  బరువు త్వరగా తగ్గాలంటే వాకింగ్ చేయాలా? సైక్లింగ్ చేయాలా?
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...