మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)పై మరో కేసు నమోదయింది. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ చక్రధర్‌గౌడ్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై ఇప్పటికే హరీష్ రావు.. కోర్టుకు వెళ్లారు. తాజాగా హరీష్ రావుపై చక్రధర్‌గౌడ్(Chakradhar Goud) మరో ఫిర్యాదు చేశారు. హరీష్ రావు సహా మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హరీష్ రావు(Harish Rao) తో పాటు ఇటీవల జైలు నుండి విడుదలైన ఆయన అనుచరులు బెదిరింపులు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో ఏ -2 గా హరీష్ రావు, ఏ -1 వంశీ కృష్ణ, ఏ -3 సంతోష్ కుమార్, ఏ -4 గా పరుశురాములు పేరను చేర్చారు పోలీసులు. హరీష్ రావు ఫై 351 (2) R/W 3, (5) BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.