ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్(Badrinath)లో భారీ ప్రమాదం జరిగింది. ఉన్నట్లుండి మంచుచరియలు(Avalanche) విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 47 మంది కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు చెప్పారు. వారి కోసం యుద్ధప్రాతిపదికన రెస్క్యూ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. కొన్ని రోజులుగా అక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో శుక్రవారం ఈ ప్రమాదానికి పరిస్థితులు దారితీశాయని అధికారులు చెప్తున్నారు. బద్రీనాథ్ ధామ్‌లోని నేషనల్‌హైవేై రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనౌజేషన్(బీఆర్ఓ) సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఈ ప్రమాదంలో 57 మంది కార్మికులు మంచుచరియల కింద చుక్కుకుపోయారని, వారిలో ఇప్పటికే 10 మందిని రక్షించి బద్రీనాథ్‌కు(Badrinath) సమీపంలో ఉన్న మనా గ్రామంలోని బీఆర్ఓ క్యాంప్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామని, మంచు తీవ్రత పెరుగుతుంటడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని బీఆర్ఓ(BRO) అధికారులు వెల్లడించారు.