బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ(Kiara Advani), నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర(Sidharth Malhotra) తమ అభిమానులకు తీపికబురు చెప్పారు. బాలీవుడ్‌లోని స్వీట్ కపుల్‌గా పేరున్న వీరు తల్లిదండ్రులు కానున్నారు. ఈ విషయాన్ని సెలబ్రిటీ కపుల్ పరోక్షంగా ప్రకటించారు. బేబీ సాక్స్‌ను పట్టుకుని ఉన్న ఫొటోను వారు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోతో పాటు ‘మా జీవితానికి సంబంధించిన అద్భుతమైన బహుమతి త్వరలో రానుంది’ అని పేర్కొన్నారు. దానికి బేబీ ఎమోజీని కూడా పెట్టడంతో నెటిజన్స్‌ను ఫిక్స్ అయిపోయారు. ముద్దుగుమ్మ కియారా కాస్తా.. అతి త్వరలో అమ్మ కియారా కానుందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి.