Revanth Reddy | ‘దేశ రక్షణకు యువత కలిసి రావాలి’

-

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు దేశ రక్షణపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన విజ్ఞాన్ వైభవ్-2025(Vignan VCaibhav) కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణ, అభివృద్ధి వంటి అంశాలపై రేవంత్ మాట్లాడారు. దేశ రక్షణ బాధ్యత యువతీ యువకులపై ఉందన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. బీడీఎల్, డీఆర్ డీఓ, మిదాని, హెచ్ఏఎల్ వంటి దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తయారు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగరం, హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి.

- Advertisement -

దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తి , దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతపై వారిలో స్ఫూర్తిని, అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం నుండి ప్రతి ఏటా లక్షకు పైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికాకు వెళుతున్నారు. వారిలో దేశభక్తితో, దేశ రక్షణ ప్రాధాన్యతనలు వివరించడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నాం. తెలంగాణ నుంచి కేవలం ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రమే అమెరికాకు వెళ్లకుండా, దేశ రక్షణ రంగానికి అవసరమైన సమర్ధవంతమైన ఇంజినీర్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ఆయన(Revanth Reddy) వివరించారు.

‘‘దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారుచేయడం మరింత ముఖ్యం. స్వాతంత్య్రానికి  ముందు, తర్వాత కూడా హైదరాబాద్‌లో బీడీఎల్, హెచ్‌ఎచ్‌ఎల్, మిదాని, డీఆర్‌డీఓ వంటి అనేక సంస్థలు దేశ రక్షణ కోసం ఉత్పత్తి రంగంలో విశేషంగా పని చేస్తున్నాయి. దేశ రక్షణ రంగానికి హైదరాబాద్, బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి. గతంలో మీతో చర్చించినట్టుగా హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలి. తద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయి. రాకెట్ తయారీ సహా ఆకాశ మార్గం (స్కై రూట్) వంటి స్టార్టప్‌లు అభివృద్ధి చెందుతాయి. అందుకోసం మీ సహకారం, మద్దతు అవసరం. రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు మేము ప్రయత్నిస్తాం’’ అని తెలిపారు.

Read Also: తల్లికాబోతున్న కియారా అద్వానీ..
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ఏపీ బడ్జెట్‌పై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను(AP Budget) శుక్రవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం...

Revanth Reddy | కిషన్ రెడ్డి.. తెలంగాణకు సైంధవుడిలా తయారయ్యారు

తెలంగాణకు ప్రాజెక్ట్‌లు రాకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్...