AP Assembly Sessions: ముగిసిన గవర్నర్ ప్రసంగం.. సభ వాయిదా

-

AP Assembly Sessions |ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం గంటలకు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన పలు సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. అనంతరం సభను వాయిదా వేశారు. బీఏసీ సమావేశం అనంతరం సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.

- Advertisement -

కాగా జస్టిస్ అబ్దుల్ నజీర్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక ఆయనకు ఇదే తొలి బడ్జెట్ ప్రసంగం. ఆయన ప్రసంగిస్తూ.. నాలుగేళ్లుగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా CM జగన్ పనిచేస్తున్నారని కొనియాడారు. నవరత్నాలతో సంక్షేమ పాలన కొనసాగుతోంది. సమీకృత అభివృద్ధి కోసం సీఎం పాటుపడుతున్నారు. 45 నెలల్లో DBT ద్వారా రూ.1.97 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందింది. గ్రామ, వార్డు సచివాలయాలతో ఇంటి వద్దకే పాలన చేరింది అని గవర్నర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో నాడు-నేడుతో స్కూళ్ల ఆధునికీకరణ జరుగుతోందని గవర్నర్ నజీర్ తెలిపారు. ఈ పథకం కింద మొదటి దశలో 3,669 కోట్లు, రెండో దశలో 8,345 కోట్లతో పాఠశాలల అభివృద్ధి జరిగింది. 9,900 కోట్లతో 44 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. 690 కోట్లతో 5.20 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు అందించాం. అనేక విద్యా సంస్కరణలతో విద్యార్థులకు మేలు జరుగుతోంది అని గవర్నర్ ప్రసంగంలో తెలిపారు.

Read Also: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్

Follow us on:  Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...