శ్రీశైలం(Srisailam) ఘాట్ రోడ్డులో టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సేప్టీ డివైడర్ ను ఢీకొట్టి అక్కడే ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, బాధితుల వివరాల మేరకు శ్రీశైలం మల్లన్న దర్శనార్థం భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా సండ్రుగుండ గ్రామానికి చెందిన 20 మంది భక్తులు శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వస్తున్నారు. క్షేత్రానికి కూతవేటు దూరంలో బస్సు డ్రైవర్ మలుపులను అంచనా వేయకపోవడంతో అతి వేగంగా వస్తున్న బస్సును అదుపు చేయలేక శ్రీశైలం శిఖరానికి 5 కిలోమీటర్ల సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డు చిన్నారుట్ల దయ్యాల మలుపు దగ్గర బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను శ్రీశైలం(Srisailam) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Also: తెలంగాణ సంపద ఏమైనా మీ అత్తగారి సొమ్మా కేసీఆర్: షర్మిల
Follow us on: Google News, Koo, Twitter