పదో తరగతి ఫలితాలు ఇద్దరు విద్యార్థినుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం శనివారం పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. అయితే పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డిలో విద్యార్థిని కామేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. టెన్త్ క్లాస్ రిజల్ట్స్‌లో కామేశ్వరి ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యింది. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన కామేశ్వరి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు శ్రీసత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం నవాబు కోటలో కూడా పదో తరగతి ఫెయిల్ అవ్వడంతో వలిపి సుభాషిని ఇంట్లో చీరతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సుభాషిని మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: నీరా కేఫ్‌కు భారీ డిమాండ్.. తాగేందుకు క్యూ కట్టిన జనం
Follow us on: Google News, Koo, Twitter