4 people died and 9 injured in Road accident at kakinada district: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో నలుగురు అక్కడిక్కకడే దుర్మరణం చెందగా, మరో తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన వారంతా కళాకారులుగా గుర్తించారు. అనకాపల్లిలో అమ్మవారి వేషాలు వేసేందుకు రాజమండ్రి నుంచి కళాకారుల బృందం టాటా మ్యాజిక్ బయలుదేరింది. వీరంతా అనకాపల్లి పేరంటమ్మ తల్లి గుడి ఉత్సవాళ్లో కసింకోట వేషాలు వేసేందుకు వెళ్తుండగా ప్రమాదం (Road accident) జరిగింది. మరికొందరు తాడేపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్నట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ తొమ్మిది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా..మృతల వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన దుబ్బాక ప్రసాద్ (46), నల్లజర్లకు చెందిన మహిళ మంగ (40), కొండ, ఉండ్రాజవరానికి చెందిన మహేష్ మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణమా లేక అతివేగమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.