ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా తీవ్ర చర్చలకు దారి తీస్తున్న అంశం ముంబయి నటి కాదంబరీ జిత్వానీ(Kadambari Jethwani) అత్యాచారం. ఈ కేసులో పలువురు పోలీసు అధికారులు సహా వైసీపీ నేతల పేర్లు కూడా వినిపిస్తుండటంతో ఇది మరింత కీలకంగా మారింది. తనను దాదాపు 30 రోజుల పాటు బంధించి అత్యాచారం చేశారని, తన తల్లిని కూడా బంధించి హింసాచరని కాదంబరీ వెల్లడించారు. ఇది విషయం పెద్ద సమస్య కావడంతో ప్రభుత్వం దీనిని సిరయస్‌గా తీసుకుని దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు కోసం కాదంబరీని విజయవాడకు రావాల్సిందగా పోలీసులు కోరారు.
పోలీసుల ఉత్తర్వుల మేరకు ఈరోజు కాదంబరీ విజయవాడకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఆమె(Kadambari Jethwani) పోలీసు కమిషనర్‌ను కలవనున్నారు. ఈ కేసులో నిజానిజాలు తేల్చడానికి ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాదంబరీ నుంచి మరిన్న వివరాలు సేకరించిన వెంటనే దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటుగా కాదంబరీపై నమోదు చేసిన ఫోర్జరీ కేసును కూడా విచారణాధికారి పరిశీలించనున్నారు.