APCC New Committees |ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన కమిటీలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆమోదం తెలిపింది. ఏపీ కాంగ్రెస్‌లో కమిటీల వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఎన్నికలు పూర్తయిన రోజుల వ్యవధిలోనే పార్టీ కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. తమతో చర్చించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రశ్నలు గుప్పించారు. ఈ క్రమంలోనే షర్మిల ఒంటెద్దు పోకడ వల్లే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్కస్థానం కూడా రాలేదని ఏపీ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఇంతలో కమిటీ ఇన్‌ఛార్జ్‌లకు కేటాయించిన గదులకు షర్మిల తాళాలు వేయడం ఈ వివాదాన్ని మరింత అధికం చేసింది. కాంగ్రెస్‌లో ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగానే నూతన కమిటీల ఏర్పాటుకు జాతీయ కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే 25 జిల్లాల డీసీసీలు, 13 మంది వైస్ ప్రెసిడెంట్లు, 37 మంది జనరల్ సెక్రటరీలు, 10 మంది సిటీ ప్రరెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
APCC New Committees వివరాలివే..
- మన్యం , అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడుగా సాతాక బుల్లిబాబు
- శ్రీకాకుళం – అంబటి కృష్ణారావు
- విజయనగరం – మరిపి విద్యాసాగర్
- విశాఖపట్నం – వెంకట వర్మ రాజు
- అనకాపల్లి – మీసాల సుబ్బన్న
- కాకినాడ – మద్దేపల్లి సత్యానందరావు
- బిఆర్ అంబేద్కర్ కోనసీమ – కొండేటి చిట్టిబాబు
- ఈస్ట్ గోదావరి – TK విశ్వేశ్వర్ రెడ్డి
- వెస్ట్ గోదావరి – హరి కుమార్ రాజు
- ఏలూరు – రాజనాల రామ్మోహన్ రావు
- కృష్ణ – గొల్లు కృష్ణ
- NTR – బొర్రా కిరణ్
- గుంటూరు – చిలక విజయ్
- బాపట్ల – ఆమంచి కృష్ణమోహన్
- పల్నాడు – అలెక్స్ సుధాకర్
- ప్రకాశం – షేక్ సైదా
- నంద్యాల – జంగేటి లక్ష్మి నరసింహ యాదవ్
- కర్నూలు – పరిగెల మురళి కృష్ణ
- అనంతపురం – మధుసూదన్ రెడ్డి
- YSR – విజయజ్యోతి
- శ్రీ సత్యసాయి – హినయ్ తుల్లా
- SPS నెల్లూరు – చేవూరు దేవ కుమార్ రెడ్డి
- తిరుపతి – బాలగురవం బాబు
- చిత్తూరు – పోటుగారి భాస్కర్
విజయవాడ సిటీ అధ్యక్షుడుగా నరహరి శెట్టి నరసింహ రావు
కాకినాడ – చెక్కా నూకరాజు
రాజమండ్రి – బాలేపల్లి మురళీధర్
శ్రీకాకుళం – రెల్లా సురేష్
విశాఖపట్నం – పిరిడి భగత్
తిరుపతి – గౌడపేరు చిట్టిబాబు
చిత్తూరు – టిక్కారాం
ఒంగోలు – నాగలక్ష్మి
కర్నూలు – షేక్ జిలానీ భాషా క
డప – అఫ్జల్ అలీ ఖాన్