వైసీపీకి షాకులపైన షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా సీనియర్ నేతలంతా పార్టీని వీడి వెళ్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు రాజీనామా చేసిన రోజుల వ్యవధిలోనే మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఆళ్ళ నాని(Alla Nani) కూడా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పంపారు.
కాగా తాను ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా నాని వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నానని ఆయన వివరించారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండటం ప్రారంభించారు. దీంతో పార్టీ అంతర్గత వివాదాల వల్లే ఆళ్ళ నాని(Alla Nani) తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.
Read Also: మంత్రులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us On: Google News, Twitter, ShareChat