వివేకా హత్యకేసు(Viveka Murder case)లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారింది. కాగా దస్తగిరి అప్రూవర్ ను సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ విచారణలో భాగంగా.. సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడని, దీంతో కక్ష కట్టిన సునీల్ యాదవ్ వివేకా తలపై దాడి చేసి హత్య చేశాడని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. తదుపరి విచారణ గురువారంకి వాయిదా వేసింది హైకోర్టు.
- Advertisement -
Read Also: వైజాగ్ స్టీల్ ప్లాంటుకు వెళ్లిన సింగరేణి అధికారులు
Follow us on: Google News, Koo, Twitter