Supreme Court: నేడు సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు విచారణకు రానుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మూడు రాజధానులకు అనుకూలంగా బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఒకే చోట నిధుల కేంద్రీకరణతో ప్రాంతీయ అసమానతలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరింది.
అయితే.. అమరావతి ప్రాంతం రాజధానికి అనువైన ప్రాంతం కాదంటూ శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల నివేదికల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. విభజన చట్టం ప్రకారం రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానికే సర్వాధికారం ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. రాజధాని భూ సమీకరణలో అనేక లోటుపాట్లు అవకతవకలు జరిగాయని.. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉందని, తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం అని చెబుతూ.. మరికొన్ని ఆంశాలను ఏపీ ప్రభుత్వం(Supreme Court) సుప్రీంకోర్టుకు అందించిన పిటిషన్‌లో ప్రతిపాదించింది.
Read also: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం