అమరావతి(Amaravati)లోని తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్-5 జోన్(R5 Zone)కు వ్యతిరేకంగా జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తుళ్లూరులో 48 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో శ్రవణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు శ్రవణ్ దీక్షకు మద్దతుగా వచ్చిన పలువురు రాజధాని రైతులు, మహిళా రైతులు, కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు పక్కకు తోసేశారు. తుళ్లూరులో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండడంతో ర్యాలీలు, నిరసనలు, దీక్షలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. మరోవైపు తుళ్లూరు మండలంలోని టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. తుళ్లూరు దీక్షా శిబిరాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు.
Read Also:
1. లైక్ చేసింది.. పాపం రూ.19లక్షలు పోగొట్టుకుంది
2. చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా: ఆనం
Follow us on: Google News, Koo, Twitter