మహిళలతో చిందులేసిన మంత్రి.. నెట్టింట వైరల్ (వీడియో)

-

Ambati Rambabu Dances in Sankranti Bhogi Celebrations: ఏపీ మంత్రి అంబటి రాంబాబు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ప్రతిపక్షాలపై ఫైర్ అవుతూ ప్రతిరోజు వార్తల్లోనే ఉంటారు. అప్పుడప్పుడు వివాదాల్లోనూ చిక్కి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు. మంత్రి ఏం చేసినా మీడియాలో హై లైట్ అవుతుంది. ఘాటు విమర్శలు చేయడంలోనూ.. నాటు స్టెప్పులు వేయడంలోనూ మంత్రిగారి స్టైలే వేరు. భోగి సందర్భంగా ఆయన చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

శనివారం ఆయన సొంత నియోజకవర్గమైన సత్తెనపల్లిలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ఆడుతూ పాడుతూ అభిమానులతో సరదాగా గడిపారు. బంజారా మహిళలతో కలిసి మాస్ స్టెప్పులేసి సందడి సందడిగా అక్కడున్నవారిని ఉర్రూతలూగించారు. మంత్రి స్టెప్పులేస్తున్నంత సేపు అక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు. మంత్రి అంబటి రాంబాబు కూడా కోలాహలంలో మైమరచిపోయి చిందులేసారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో కింద ఉంది చూడవచ్చు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...