అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

-

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu), ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన మావయ్య అంబటి రాంబాబు దుర్మార్గుడు అంటూ ఆయన అల్లుడు ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆరోపణలను అంబటి తీవ్రంగా ఖండించారు. తన అల్లుడు వెనక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆరోపించారు. తాజాగా అంబటి ఆరోపణలపై స్పందిస్తూ గౌతమ్(Goutham) మరో వీడియో విడుదల చేశారు.

- Advertisement -

“ఇటీవల నేను పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు. అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మా మామయ్య ఇంత మంచోడా అని నేనేన నమ్మేశా. ఆ ప్రెస్ మీట్లో నాలుగేళ్ల నుంచి తన మనవడు, మనవరాలు తన దగ్గరే ఉంటున్నారని.. వారి ఆర్థిక అవసరాలు జాగ్రత్తగా చూసుకుంటున్నానని చెప్పారు. అల్లుడైన నేను ఎలాంటి ఆర్థిక సాయం లేదని.. దుర్మార్గున్ని అయితే గీతే నేనేనంటూ మా మామయ్య అంబటి రాంబాబు(Ambati Rambabu) మాట్లాడారు. నా వెనుక మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆరోపించారు” అని తెలిపారు .

ఈ వీడియో నేను 2023 మార్చి 3న పంపించిన వీడియో ఇది. ఆయనకు మాట కూడా రావడం లేదు. అయినా కూడా మనవణ్ని, మనవరాలిని చూడాలని నా తండ్రి ఐసీయూ నుంచి కోరుకున్నారు. మార్చి 22 నా తండ్రి చనిపోయాడు. తన మనవణ్ని, మనవరాలిని చూసుకోలేదని ఆయన ఎంత కృంగిపోయి ఉంటాడో మీకు తెలుసా. మీ కుటుంబాన్ని ప్రశ్నిస్తే ఎంత దుర్మార్గమైనా చేస్తారా. ఒక తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని కొడుకుగా మిగిలిపోయా. మీరేదో న్యాయం చేస్తారని నమ్మి నాలుగేళ్లు ఎదురుచూసి.. చివరకు విసిగెత్తి కోర్టుకు వెళ్లా” అని గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నా తండ్రి ఆఖరి క్షణాలలో తన మనవడ్ని, మనవరాలని చూసుకోవాలని పంపించాలని నేను ప్రాధేయపడితే పంపలేదు. ఇప్పటికీ చెప్తున్నా.. నా కొడుకును, కూతురుని మీరు పోషించాల్సిన పనిలేదు. మీరు రూపాయి పెట్టాల్సిన పనిలేదు. మీడియా సాక్షిగా నా పిల్లలను మా ఇంటి దగ్గర వదిలిపెట్టండి. నేను పోషించుకుంటా. కనీసం మీకు ఆత్మసాక్షి ఉందా. ప్రజలారా ఇలాంటి నాయకులు గురించి ఇక మీరే ఆలోచించుకోండి”. అంటూ అందులో పేర్కొన్నారు.

Read Also: పవన్ కల్యాణ్‌ను గెలిపించండి.. ప్రజలకు అన్నయ్య చిరంజీవి సందేశం..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...