ఎన్నికల వేల ఏపీ రాజకీయాలు రసవత్తరంగా జరుగుతన్నాయి. ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరే నేతలు చేరడం కామన్ అయిపోయింది. ఈ కోవలోనే తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో చేరిక, రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో పవన్‌కు వివరించినట్లు సమాచారం.
కొద్దికాలంగా రాజకీయాల్లోకి వచ్చేందుకు మొగ్గు చూపిన రాయుడు.. ఎట్టకేలకు సీఎం జగన్(YS Jagan) సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే చేరిన వారం రోజులకే పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అయితే గుంటూరు(Guntur) ఎంపీగా పోటీ చేయాలని రాయుడు భావించగా.. మచిలీపట్నం(Machilipatnam) లేదా వైజాగ్(Vizag) ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించినట్లు చెబుతున్నారు. జగన్ ప్రతిపాదనకు అంగీకరించిన ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన సొంత జిల్లా అయిన గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న రాయుడు(Ambati Rayudu).. జనసేనలో చేరి ఆ టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు భోగట్టా. అందుకు తగట్లే టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.