అమిత్ షా వైజాగ్ పర్యటన షెడ్యూల్ ఖరారు

-

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఆంధ్రప్రదేశ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. దేశ ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో విజయోత్సవ సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ(Vizag)లో నిర్వహించనున్న మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అమిత్ షా(Amit Shah) ఈ నెల 11న ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు ర్యాలీగా స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రి 7గంటలకు నగరంలోని రైల్వే గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో పోర్ట్ సాగరిక కళ్యాణ మండపంలో సమావేశమవుతారు. పోర్ట్ గెస్ట్ హౌస్‌లో రాత్రి బసకు ఉపక్రమిస్తారు. సోమవారం ఉదయం వివిధ ఆలయాల సందర్శన అనంతరం ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని స్థానిక బీజేపీ నేతలు తెలిపారు.

Read Also:
1. మరో వివాదంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...