ముద్దుల వీడియోపై ఎమ్మెల్సీ అనంతబాబు క్లారిటీ

-

వైరల్ అవుతున్న తన అభ్యంతరకర వీడియోపై వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు(Ananth Babu) స్పందించారు. ఆ వీడియోలో అనంతబాబు ఎవరికో ముద్దులు పెడుతూ కనిపించారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. తనపై కొందరు కక్షపూరితంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైరల్ అవుతున్నది మార్ఫింగ్ వీడియోని, హనీట్రాప్ చేసిన తనను ఇరికిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ‘‘గతంలో ఓ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వీడియో కాల్ మాట్లాడుతూ చిన్న పిల్లలకు ముద్దు పెట్టాను. దానిని ఇప్పుడు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు. గత ఆరునెలలుగా ఇలానే మార్ఫింగ్ వీడియోలతో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’’ అని అనంతబాబు చెప్పారు.

- Advertisement -

తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ గతంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌లో అనంతబాబు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో మరోసారి పోలీసులను ఆశ్రయించారు అనంతబాబు(Ananth Babu). ఈ సందర్బంగా రంపచోడవరం ఇంఛార్జ్ ఏఎస్పీ మాట్లాడుతూ.. సమగ్ర విచారణ కోసం పూర్తి సమాచారం అందించాలని ఎమ్మెల్సీని కోరినట్లు చెప్పారు. ఆ వివరాలు వచ్చిన వెంటనే విచారణ ప్రారంభిస్తామని వివరించారు.

Read Also: 2036 టార్గెట్ ఫిక్స్ చేసిన రేవంత్
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...