Andhra Tourist Killed | గోవాలో ఏపీకి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి హోటల్ యాజమాన్యం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కి చెందిన రవితేజ అనే యువకుడిని కొట్టి చంపింది. శనివారం రవితేజతో సహా ఐదుగురు యువకులు, ముగ్గురు యువతులు గోవా ట్రిప్ కి వెళ్లారు. వీరంతా ఆదివారం రాత్రి భోజనం కోసం ఓ హోటల్ కి వెళ్లారు.
Andhra Tourist Killed | అయితే వీరిలోని ఓ యువతితో హోటల్ యజమాని కొడుకు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో రవితేజ అతనిపై ఆగ్రహంతో తిరగబడ్డాడు. ఇరువురి మధ్య ఘర్షణ తీవ్రం అవడంతో హోటల్ యాజమాన్యం రవితేజపై దాడి చేసింది. ఈ దాడిలో తలకి బలమైన గాయం కావడంతో రవితేజ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న తాడేపల్లి గూడెం ఎంఎల్ఏ బోలిశెట్టి శ్రీనివాస్ గోవా ప్రభుత్వంతో మాట్లాడారు. దీంతో స్పెషల్ ఫ్లైట్ లో రవితేజ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు.