AP Assembly | నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ఏపీ క్యాబినెట్ బడ్జెట్ కి ఆమోదం తెలుపనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ(Payyavula Keshav) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ.2.7 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మరోవైపు వైసీపీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించింది.
AP Assembly | నేటి నుంచే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
-