AP Cabinet | ముగిసిన ఏపీ క్యాబినెట్.. 14 అంశాలకు ఆమోదముద్ర

-

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం(AP Cabinet) ముగిసింది. ఎజెండాలోని 14 అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. SIPB ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

- Advertisement -

నేటి AP Cabinet నిర్ణయాలు…

పిఠాపురం(Pithapuram) ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కేబినెట్ ఏపీ MRUDA చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటుపై కేబినెట్ మీటింగ్ లో చ‌ర్చించారు.

చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్‌లో చ‌ర్చ జ‌ర‌గింది.

నంద్యాల, వైఎస్‌ఆర్‌, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.

ఎస్‌ఐపిబి అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ అమోదం తెల‌పింది. ఈ పెట్టుబడులు వ‌ల‌న 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది.

నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్న‌ల్. దీని వ‌ల‌న‌ 2,400 మందికి ఉపాధి కలగనుంది.

మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించ‌నున్నారు.

విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ రూ. 80 కోట్ల పెట్టుబడుల‌కు అమోదం తెలిపింది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

శ్రీ సత్యసాయి జిల్లా, గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్ధ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల కోసం ఈ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడిల‌కు క్యాబినెట్ ఓకే చెప్పింది. దీని ద్వారా 2,381 మందికి ఉపాధి కలుగనుంది.

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబ‌డుల‌కు , ది. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎన‌ర్జీలో రూ. 83 వేల కోట్ల పెట్టుబడుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

వీటితోపాటు సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టూ బనకచర్ల ప్రాజెక్టుపై క్యాబినెట్‌లో చ‌ర్చించారు.

Read Also: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్తత
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...