AP Cabinet | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం..

-

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐదేళ్లుగా నిరుద్యోగులు చూస్తున్న ఎదురుచూపులకు మోక్షం లభించింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ(AP Cabinet) సమావేశం మెగా డీఎస్సీ(Mega DSC)కి ఆమోదం తెలిపింది. మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పాటు అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు కూడా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రభుత్వం నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 40 అంశాలతో కూడిన అంశాలపై మంత్రివర్గం సమావేశంలో చర్చించగా.. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు.

- Advertisement -

AP Cabinet Decisions..

ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధుల విడుదలకు ఆమోదం

ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా పంచాయితీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం

500 లోపు జనాభా ఉన్న పంచాయతీలకూ సెక్రటరీల నియామకం

యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు

ఎక్రోన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1350 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనను మంత్రివర్గం

3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ కు ఆమోదం

పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం

డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి ఆమోదం

న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం

ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెజిస్లేచర్‌ స్టడీస్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఏర్పాటుకు ఆమోదం

అసైన్డ్‌ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు అంగీకారం

డిజిటల్ ఇన్‌ఫ్రా కంపెనీని రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం

సీఎం కుటుంబ భద్రతకు ఏర్పాటు చేసే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో 25 మంది హెడ్‌ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అంగీకారం

ఇంధన రంగంలో రూ.22 వేల కోట్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం

Read Also: కుమారీ ఆంటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భరోసా
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...