AP Cabinet | టూరిజం పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం.. ఇంకా ఎన్నో నిర్ణయాలు..

-

ఏపీలో సరికొత్త టూరిజం పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం(AP Cabinet) ఆమోదముద్ర వేసింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో భాగంగానే పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై కూడా చర్చించారు మంత్రులు. అనంతరం ఈ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యాబినెట్. దాంతో పాటుగానే జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు కూడా మంత్రివర్గం ఓకే చెప్పేసింది. ఏపీ ఇన్‌ఫ్రా ట్రాన్స్‌పరెన్సీ చట్టం 2019ను తిరిగి తీసుకురావలన్న ప్రతిపాదనపై కూడా చర్చించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ చట్ట సవరణ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వీటితో పాటుగా మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకుంది ఆంధ్ర మంత్రివర్గం.

- Advertisement -

AP Cabinet తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని..

 

అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం. కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొంసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు పంపింది.


నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం.


దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు ఆమోదం


లోకాయుక్త చట్టసవరణ బిల్లుకు ఆమోదం. లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనేదానిపై చర్చించారు. పార్లమెంట్లో అనుసరించిన విధానం కొనసాగించాలని నిర్ణయించారు.


కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయిం తీసుకున్నారు.


రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం


2024-25 కొత్త క్రీడా పాలసీకి ఆమోదం.


డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌ పేరును ఎలైట్ యాంటీ నార్కొటిక్ గ్రూప్(ఈగల్) మారుస్తూ తీర్మానం.


ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకోనున్న ఒప్పందానికి ఆమోదం.


ఏపీ టవర్స్ లిమిటెడ్‌ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్‌ లిమిటెడ్‌లో విలీనం.

Read Also: ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అసెంబ్లీలో గర్జించిన చంద్రబాబు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...