మహారాష్ట్రలో బీజేపీ కూటమి తన తడాఖా చూపింది. 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 220కిపైగా స్థానాల్లో మహాయుతి కూటమి భారీ మెజార్టీతో దూసుకుపోతోంది. బీజేపీ ఒంటరిగా 125కిపైగా స్థానాలకు కైవసం చేసుకునే వాతావరణం కనిపిస్తోంది. దీంతో మహారాష్ట్రలో మహాయుతి(Mahayuti Alliance) విజయం ఫైనల్ అయిపోయింది. ఈ సందర్భంగానే ఈ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. మహాయుతి కూటమికి తన శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde), డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు తెలిపారు. మరాఠా ప్రజలు మహాయుతి కూటమికి అపూర్వ విజయం కట్టబెడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అంతా కలిసి కట్టుగా చేసిన పోరాట ఫలితమే ఈ విజయమని కూటమి నేతలు, కార్యకర్తలను అభినందించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరాఠా ప్రజలు మాత్రం మహాయుతినే నమ్మారని అన్నారు చంద్రబాబు(Chandrababu).