ఫిలాంత్రఫిస్ట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్( Bill Gates), ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీలో గేట్స్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి గేట్స్ ఫౌండేషన్ సాంకేతిక సహకారం అందించనుంది.
ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన రంగాలలో సర్వీస్ డెలివరీ మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ను ఉపయోగించడంపై బిల్ గేట్స్, చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. చర్చల ఫలితంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పనా రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి గేట్స్ ఫౌండేషన్ సాంకేతిక సహకారం అందించనుంది.
భేటీ అనంతరం X వేదికగా చంద్రబాబు నాయుడు(Chandrababu) ఓకే ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, ఆలోచనలు, మద్దతు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం గురించి చర్చించినంట్లు వెల్లడించారు. రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యం అయిన ‘స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047’ దార్శనికతను సాకారం చేయడంలో గేట్స్ ఫౌండేషన్(Gates Foundation) పాత్ర కీలకం కానునందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం మన ప్రజలకు సాధికారత కల్పించడంలో, లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మేము విశ్వసిస్తున్నాము అని ఆయన అన్నారు.