AP Congress | ఏపీలో కాంగ్రెస్ మూడో జాబితా.. 9 మంది ఎంపీ అభ్యర్థుల ప్రకటన..

-

AP Congress | ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా మూడో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. శ్రీకాకుళం నుంచి పరమేశ్వరరావు, విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను, అమలాపురం(ఎస్సీ) నుంచి జంగా గౌతం, మచిలీపట్నం నుంచి గొల్లు కృష్ణ, విజయవాడ నుంచి వళ్లూరు భార్గవ్, ఒంగోలు నుంచి సుధాకర రెడ్డి, నంద్యాల నుంచి జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్, అనంతపురం నుంచి మల్లికార్జున్ వజ్జల, హిందూపురం నుంచి బీఏ సమద్ షాహీన్‌లను ఖరారు చేశారు.

- Advertisement -

AP Congress | కాగా తొలి జాబితాలో 5 పార్లమెంటు స్థానాలు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. రెండో జాబితాలో 6 ఎంపీ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారుచేశారు. తాజాగా 9 మంది పార్లమెంట్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు 126 అసెంబ్లీ స్థానాలు, 20 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్లైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్న సీపీఐ 8 అసెంబ్లీ, ఓ పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను వెల్లడించింది. కడప పార్లమెంట్ నుంచి ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read Also: ఏపీలో పదో తరగతి పరీక్షలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...