ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర(Rajanna Dora) సంచలన వ్యాఖ్యలు చేశారు. సెటిలర్స్ వల్ల సాలూరు స్థానికులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన చౌదరి, రెడ్లు వల్ల తమకు నష్టం జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలోని భూములు, వ్యాపారాలు అన్ని వాళ్ల చేతుల్లోనే ఉన్నాయన్నారు. గిరిజనుల మీద బతుకుతూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సాలూరులో సంపాదించుకుంటూ అభివృద్ధికి మాత్రం సహకరించడం లేదని ఆరోపణలు గుప్పించారు. బబ్లూ అనే సెటిలర్ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. ఈ పరిస్థితి మారాలంటే సాలూరుని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరుకు కూడా తీసుకెళ్తానని అన్నారు.
Read Also: పవన్ కల్యాణ్ సీఎం అయితే జరిగేది అదే.. నాగబాబు కీలక వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter