AP Budget | బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం.. కేటాయింపులు ఎలా ఉన్నాయంటే

-

2024-2025 వార్షిక బడ్జెట్‌(AP Budget)కు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేవంలో బడ్జెట్‌పై చర్చించారు. అనంతరం బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేశారు. కాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభమయ్యాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav).. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను సిద్ధం చేశారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయాన్ని రూ.2.34 లక్షల కోట్లుగా అంచనా వేశారు. మూలధన వ్యయాన్ని రూ.32,712 కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపారు. ఇదే విధంగా ఇతర కీలక రంగాలకు కూడా పెద్ద మొత్తంలో కేటాయిస్తున్నట్లు మంత్రి పయ్యావులు ప్రకటించారు.

- Advertisement -

AP Budget – వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా..

  • పాఠశాల విద్య రూ.29,909కోట్లు

  • మహిళ, శిశు సంక్షేమం రూ.4,285కోట్లు

  • మానవ వనరుల అభివృద్ధి రూ.1,215కోట్లు

  • ఉన్నత విద్యకు రూ.2,326 కోట్లు

  • ఆరోగ్య రంగానికి రూ.18,421కోట్లు

  • పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లు

  • పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు

  • గృహనిర్మాణం రూ.4,012కోట్లు

  • జలవనరులు రూ.16,705కోట్లు

  • పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127కోట్లు

  • ఇంధన రంగం రూ.8,207కోట్లు

  • రోడ్లు, భవనాలకు రూ.9,554కోట్లు

  • యువజన, పర్యాటక, సాంస్కృతిక రూ.322కోట్లు

  • పోలీస్ శాఖకు రూ.8,495 కోట్లు

  • పర్యావరణ, అటవీశాఖకు రూ.687కోట్లు
Read Also: రాగులే కదా అని తీసిపారేయకండి.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...