రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

-

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident) జరిగి.. వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెంది, వేలాది మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై రైల్వేశాఖ నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిగ్నల్‌ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించింది. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్‌ను కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడం వల్లే మొదట ప్రమాదం జరిగిందని తెలిపింది. మెయిన్ లైన్‌లో నుంచి వెళ్లాల్సిన కోరమండల్ లూప్ లైన్లోకి వెళ్లిందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

అయితే, ఈ ప్రమాదంలో(Odisha Train Accident) చనిపోయిన ఏపీకి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందిన ఏపీకి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను(Ex-gratia) ఇవ్వనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) తెలిపారు. తీవ్ర గాయాలైన క్షతగాత్రులకు 2 లక్షలు… స్వల్ప గాయాలైన వారికి 1 లక్ష పరిహారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున అందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర సహాయానికి ఇది అదనపు సహాయంగా తెలిపారు.

Read Also:
1. ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో ఏపీ వాసి మృతి 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...

గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తులు రూ.5,785కోట్లు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు...