ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా సెలవుల(Dussehra Holidays)పై ప్రకటన వెలువరించింది. మరి కొన్ని రోజుల్లో శరన్నవరాత్రులు మొదలవనున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలు దసరా మహోత్సవాలకు ఘనంగా ముస్తాబవుతున్నాయి. మరోవైపు విద్యార్థులు ఎప్పుడెప్పుడు దసరా సెలవులు వస్తాయా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దసరా పదిరోజుల పండుగ. దీంతో ఈ పండుగకు ఎక్కువ రోజులు సెలవులు వస్తాయి. ఇక ఈ సెలవుల్లో టూర్స్ కి వెళ్ళడానికి కుటుంబసభ్యులు ప్లాన్ చేస్తుంటారు. అందుకే స్టూడెంట్స్ దసరా సెలవుల కోసం ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో దసరా సెలవులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
అక్టోబరు 13 నుంచి దసరా సెలవులు(Dussehra Holidays) ఖరారు చేసింది. అక్టోబరు 5 నుంచి 11వ తేదీ వరకు ఎస్ఏ-1 పరీక్షలు జరగనున్నాయి. 8వ తరగతి విద్యార్థులకు మినహా.. మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పూటే పరీక్షలు ఉండనున్నాయి.అక్టోబరు 13 నుంచి 25 వరకు సెలవులు కొనసాగగా.. 26వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.