AP Assembly | ఏపీ బడ్జెట్ 2025 – 26 సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగం చేసారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే లు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి సభకు హాజరయ్యారు. వైసీపీ(YCP) ఎమ్మెల్యేల నిరసనల నడుమే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని అన్నారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం. 200 అన్న క్యాంటిన్లను తెరిచి పేదల ఆకలి తీర్చుతున్నామని అన్నారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ కి కట్టుబడి తొలి సంతకం డీఎస్సీ ఫైల్ పై పెట్టాం. పెన్షన్స్ రూ. 4 వేలకు పెంచి ప్రతి నెల మొదటి తేదీన అందిస్తున్నామని తెలిపారు. కూటమి సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన మేలు జరగనుంది అని అన్నారు. గత ప్రభుత్వంలో అనేక రంగాలు దెబ్బతిన్నాయని, ఎంతో నష్టం చవిచూసిందని గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
గవర్నర్ ప్రసంగం ప్రారంభించినప్పటి నుండి వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగులుతూనే ఉన్నారు. వైసీపీ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేసి.. పోడియం వద్ద కాసేపు నిరసన చేసారు. అనంతరం సభ నుండి వైసీపీ పార్టీ సభ్యులంతా బయటికి వెళ్లిపోయారు. అనర్హత వేటు నుండి తప్పించుకునేందుకే జగన్ అసెంబ్లీ(AP Assembly) వస్తున్నారన్న నేపథ్యంలో సభ ప్రారంభం అయ్యాక 11 నిమిషాలకే సభలో హడాహుడి సృష్టించి గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోవడం గమనార్హం.