Gudlavalleru Engg College | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ఈ అంశంపై విచారణ జరపడానికి ప్రత్యేక విచారణ అధికారిని కూడా నియమించడం జరిగిందని కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్(SP Gangadhar) వెల్లడించారు. ఈ ఘటనపై ప్రత్యేక అధికారితో పాటు మరో ఐదుగురితో కలిసిన పోలీస్ సాంకేతిక సిబ్బందితో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు విచారణ బృందం వెంటనే రంగంలోకి దిగి బాలికల వసతి గృహంలో తనిఖీలు మొదలుపెట్టింది. అందరూ అనుకుంటున్నట్లు వీడియో చిత్రీకరణ జరిగిందా? జరిగితే దీని వెనక ఎవరెవరు ఉన్నారు? ఇదంతా విజయ్ ఒక్కడు వేసిన ప్లానేనా? ఆ వీడియోలను బాధ్యులు అమ్ముకుని ఉంటే.. కొనుగోలుదారులు ఎవరు? వంటి అన్ని కోణాల్లో దర్యాప్తును పరుగులు పెట్టిస్తామని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్పీ ధైర్యం చెప్పారు.
Gudlavalleru Engg College | సీఎం ఆదేశాల మేరకు మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్ రావు, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల వసతి గృహం వద్దే ఉండి విద్యార్ధుల నుంచి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు.