Medical Courses Fees | మెడికల్ విద్యార్థులకు కూటమి సర్కార్ కంటిపైన కునుకులేకుండా చేసింది. పీజీ వైద్యవిద్య ప్రవేశ ఫీజుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా ఈ ఫీజుల పెంపుపై చర్చ జరుగుతుండగా వీటిని పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ ఫీజులను దాదాపు 15శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పెరిగిన ఫీజులు కన్వీనర్, బీ, సీ కేటగిరీల్లో వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా పీజీ దంతవైద్య విద్య ఫీజులు కూడా 15శాతం పెరిగాయి. దాదాపు అన్ని వైద్య కళాశాలల్లో 2024-2025 విద్యాసంవత్సర ప్రవేశాల ప్రక్రియ మొదలైంది.
Medical Courses Fees | ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఆంధ్ర, ఎస్వీయూ పరిధిలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో, తిరుపతి శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇప్పటికే విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ కూడా మొదలైంది. నీట్ యూజీ 2024 కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ వచ్చి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన మెరిట్ ఆర్డర్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.