అన్నీ మెడికల్ కాలేజీల్లో EWS అమలు

-

ఆర్థికంగా వెనకబడిన తగతుల వారికి అందించే రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్(EWS Quota). ఈ కోటా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికాలేజీల్లో ఈ కోటాను అమలు చేయాలని నిర్ణయించింది సర్కార్. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో ఈ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ఉత్తర్వులను కళాశాలలకు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో EWS కింద సీట్లు భర్తీ అవుతున్నాయి. అయితే ఈ కోటా కింద అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ జరగాలని నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది అక్టోబరులో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ ఈ నిర్ఱణయం తీసుకుంది.

- Advertisement -

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ(NTR Health University) అనుబంధ మెడికల్ కాలేజీల్లో ఈ కోటా కింద 10శాతం సీట్లు భర్తీ చేయాలని ప్రభుత్వ ఆదేశించింది. ఈ నిర్ణయం మైనారిటీ విద్యాసంస్థలకు వర్తించదని, ఎంబీబీఎస్తోపాటు పీజీ, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కోటా(EWS Quota) వర్తిస్తుందని సర్కార్ తెలిపింది. అదే విధంగా సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇది వర్తించదని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read Also: అమరావతి రైల్వే లైన్‌కు తెలంగాణలో భూసేకరణ
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

స్వీట్స్ తినకుండా ఉండలేకపోతున్నారా.. ఈ వార్త మీకోసమే..

Eat Sweets | స్వీట్స్ అందరికీ నచ్చేవి.. ఊరించేవి. ఆ తర్వాత...

గవర్నర్ హరిబాబును ఐసీయూకి షిఫ్ట్ చేసిన వైద్యులు..

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు(Kambhampati Haribabu) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను...