ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan)కు ప్రభుత్వం కేటాయించే కార్లను మార్చడం జరిగింది. ఈ క్రమంలో జగన్‌కు కండిషన్‌లో లేని కార్లు ఇచ్చారని, భద్రతను కూడా తగ్గించేశారని, ఈ చర్యల ద్వారా కూటమి ప్రభుత్వం తన కుటిల మనస్తత్వాన్ని చూపించుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం తెగ జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్వయంగా స్పందిస్తూ.. కార్లను మార్చడానికి అసలు కారణాన్ని వివరించింది. జగన్‌కు ప్రస్తుతం జెడ్+ భద్రత ఉన్నట్లు స్పష్టం చేసింది. అదే విధంగా వాహనాల ఫిట్‌నెస్ విషయంలో వస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది. వాహనాలు అన్నీ కూడా పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉన్నాయని వివరించింది. వాహనాల కండిషన్‌ను పూర్తిగా పరీక్షించిన తర్వాతే వీఐపీకి కేటాయించడం జరిగిందని, జగన్‌కు ఇచ్చిన వాహనాలపై జరుగుతున్న ప్రచారం అంతా నిరాధారమైనవరి, అసత్యాలేనని ప్రభుత్వం చెప్పింది.
జగన్(YS Jagan) కారు దిగి వేరే కారులో వెళ్లిన తర్వాత ప్రభుత్వం కేటాయించిన కారు కూడా అదే కాన్వాయ్‌లో వెళ్లిందని, అప్పుడు ఎటువంటి ఇబ్బంది కలుగలేదని చెప్పింది ప్రభుత్వం. అదే విధంగా జగన్ వెంట వచ్చిన వాహనాలను నిలిపేశారన్న మాట కూడా పచ్చి అబద్దమని, జగన్ వెళ్తున్న పరామర్శ కార్యక్రమానికి ఎటువంటి అవాంతరాయం కలుగకూడదని, ఆ సమయంలో నిరసనలు వంటిని జరగకూడదనే తాము చర్యలు తీసుకున్నామని భద్రతా సిబ్బంది వివరించింది. జగన్‌కు ప్రస్తుతం కల్పిస్తున్న భద్రత నిబంధనలను అనుసరించే ఉందని, అందులో ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read Also: వివాదాస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై డ్రగ్స్ కేసు
Follow us on: Google News, Twitter, ShareChat