టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు(AP High) భారీ ఝలక్ ఇచ్చింది. ఈ కేసుల్లో ముందుస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసింది న్యాయస్థానం. దీంతో తాము ముందస్తు బెయిల్ అంశంపై సుప్రీంకోర్టు ఆశ్రయాంచడానికి తమను రెండు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని వైసీపీ నేతలు న్యాయస్థానాన్ని కోరారు. దీంతో వారికి అరెస్ట్ నుంచి విముక్తి ఇవ్వొద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోరారు.
కాగా వైసీపీ నేతలకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వడానికి కూడా ఏపీ హైకోర్టు(AP High) తిరస్కరించింది. ఈ కేసులు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఈ కేసులో దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం తదితరులు నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ పేరు కూడా ఉంది.